షాకింగ్ … బీజేపీ అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేసిన కేసీఆర్ ?

తెలంగాణలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులను గులాబీ అధినేత కేసీఆర్ ఫైనల్ చేశారా ? కేసీఆర్ బయటకు బీజేపీని తిడుతున్నా, బీజేపీ కేసీఆర్ ను తిడుతున్నా లోపల దోస్తానా నడుస్తుందా ? ఇరు పార్టీలు ఒప్పందంతో పని చేస్తున్నారా? హైదరాబాద్ లో బీజేపీ పోటీ చేసే దగ్గర టీఆర్ఎస్ నుండి డమ్మీ అభ్యర్థులను నిలబెడుతున్నారా ? ఓడిపోతారని తెలిసి కూడా అలా చేస్తుంది బీజేపీ కోసమేనా? అంటే అవును అని ఠక్కున చెప్పేస్తారు తెలంగాణా కాంగ్రెస్ నాయకులు.

తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ బీజేపీల చీకటి ఒప్పందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుపార్టీలు ఒప్పందంతో పని చేస్తున్నాయని ఆరోపించారు. విభజన హామీలు అమలు చెయ్యకపోయినా బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ సహకరించిందని విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్‌కు వస్తున్నారని ప్రశ్నించైనా పొన్నం ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అమిత్‌ షా కంటే మందు ఏసీబీ, ఈడీ అధికారులు వస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ-టీఆర్‌ఎస్‌లు కావాలనే కాంగ్రెస్‌ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నాయని మండిపడ్డారు.
మోదీ కేసీఆర్ లది ఫెవికాల్ బంధం అన్న పొన్నం గతంలో గజ్వేల్‌ సభలో కేసీఆర్‌, నరేంద్ర మోదీ పరస్పరం పొగుడుకున్నారని గుర్తు చేశారు.

ఇద్దరు పరస్పర అంగీకారంతోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంలేదని వ్యాఖ్యానించారు. బీజేపీ అభ్యర్థుల లిస్టు కూడా కేసీఆరే రెడీ చేసి అమిత్‌ షాకు పంపించారని చెప్పిన ఆయన కేసీఆర్ ఎన్నికల నేపధ్యంలో బీజేపీతో చేసుకున్న ఒప్పందంలో భాగమే ఇదంతా అని చెప్పుకొచ్చారు. మరోవైపు బీజేపీ-టీఆర్‌ఎస్‌ నేతలు ఉదయం తిట్టుకుంటారని సాయంత్రం కలుసుకుంటారని టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని అన్నారు. మొత్తానికి బీజేపీ అభ్యర్థుల లిస్టు ఫైనల్ చెయ్యటంలో కేసీఆర్ పాత్ర ఉందనే మాట నిజమే కావచ్చని గులాబీ అసంతృప్త నేతల్లో కూడా వినిపిస్తున్న మాట.

Facebook Comments