షాకింగ్ డీల్ .. రేవంత్ ను ఓడించేందుకు 100 కోట్లు !

తెలంగాణలో కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొనే రాజకీయనాయకుడు ఎవరైనా ఉంటె అది రేవంత్ రెడ్డి . మొదట నుండి రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ కు మంట. తొడగొట్టి మరీ సవాల్ చేసిన , మీసం మేలేసిన ఆయన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఐటీ దాడులతో ఇరకాటంలో పెట్టె ప్రయత్నం చేశాడు. అయినా సరే జైలుకు పంపినా నామినేషన్ వేస్తానన్న రేవంత్ అదే స్థాయిలో టీఆర్ఎస్ పై కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అయితే రేవంత్ ను టార్గెట్ చేసుకున్న కేసీఆర్ అక్కడ రేవంత్ పై పోటీకి నరేందర్ రెడ్డి ని రంగంలోకి దించారు. రేవంత్ ని ఓడించటానికి వంద కోట్ల డీల్ చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి మహాకూటమి నుండి కనిపిస్తున్న సీఎం అభ్యర్థి కావటంతో మొదట నుండి ఆయన టార్గెట్ గా కేసీఆర్ రకరకాల కుట్రలు చేస్తున్నారన్న నేపధ్యంలో ఇది నిజమే అని జనం కూడా నమ్మారు. రేవంత్ కోసం అంత డీల్ పెట్టినా పెట్టి ఉండొచ్చు అనుకున్నారు.

అయితే అదంతా ట్రాష్ అని కొట్టి పారేసే ప్రయత్నం చేశారు కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి.కొడంగల్ నియోజకవర్గం..కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కంచుకోట. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఇమేజ్ సంపాదించుకున్న రేవంత్ రెడ్డిని ఎలాగైనా సరే ఎలాగైనా ఓటమి పాలు చెయ్యాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రేవంత్ రెడ్డి కోట బద్దలు కొట్టి తెరాస జెండా పాతాలని కేసీఆర్‌ ఉవ్విళ్లూరుతున్నారు.ఇప్పటికే తెరాస కొడంగల్ టికెట్ ని మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి కి కేటాయించింది.నరేందర్ రెడ్డి కూడా రేవంత్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.తాజాగా మీడియా తో మాట్లాడిన నరేందర్ రెడ్డి దమ్ము, ధైర్యముంటే రేవంత్‌రెడ్డి తనపై గెలవాలని సవాల్‌ విసిరారు.

మాటలతో మభ్యపెట్టి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్‌రెడ్డిని ఈసారి ప్రజలు తిరస్కరిస్తారని నరేందర్‌రెడ్డి చెప్తున్నారు. తెరాస ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలుపు తీరాలకు చేరుస్తాయని నరేందర్‌రెడ్డి భావిస్తున్నారు.ఈ దీపావళి నాటికి మిషన్‌ భగీరథ ఫలాలు అన్ని గ్రామాలకు అందుతాయని.. రాబోయే రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ద్వారా కొడంగల్‌ నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని నరేందర్‌రెడ్డి వివరించారు. కొడంగల్‌లో మిషన్‌ భగీరథ ఆలస్యానికి రేవంత్‌రెడ్డి తీరే కారణమని విమర్శించిన ఆయన నియోజకవర్గంలో నాపరాయి పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు.రేవంత్‌ను ఓడించేందుకు రూ.వందకోట్ల ఒప్పందం కుదిరిందంటూ చేస్తున్న ప్రచారం హాస్యాస్పదమని ఆయన అన్నారు. కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా … రేవంత్ ఓటమి కోసం కేసీఆర్ ఎంతైనా ఖర్చు పెడతారు.. ఏమైనా చేస్తారు అని చర్చించుకుంటున్నారు తెలంగాణా ప్రజలు.

Facebook Comments