ఎన్టీఆర్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్ర ఆడియో వేడుక వాయిదా పడింది. ఈనెల 20న అంగరంగ వైభవంగా నిర్వహించాలని అనుకున్నారు కానీ హరికృష్ణ మరణం నేపధ్యంలో నందమూరి కుటుంబంలో విషాదం ఇంకా అలాగే వున్న కారణం గా అరవింద సమేత వీర రాఘవ ఆడియో వేడుక రద్దు అయ్యింది అని తెలుస్తుంది. వచ్చే నెలలోనే ఆడియో ఫంక్షన్ కూడా నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం.

నందమూరి అభిమానుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , నందమూరి బాలకృష్ణ ముఖ్య అథితులుగా అరవింద సమేత ఆడియో వేడుక చేయాలనీ అనుకున్నారు కానీ హరికృష్ణ చనిపోయి ఇంకా దుఃఖసాగరంలోనే ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి కొంత గ్యాప్ ఇచ్చి ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిద్దామని ఆడియో వేడుకని రద్దు చేశారట .

అయితే ఆంధ్రప్రదేశ్ లో నందమూరి అభిమానులతో పాటుగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పాల్గొనే విధంగా భారీ వేడుక నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.. అక్టోబర్ మొదటి వారంలో ప్రీ రిలీజ్ వేడుక చేయనున్నారు .ఎన్టీఆర్ ని ఆ ఇద్దరితో కలిపి చూస్తే నందమూరి అభిమానుల కిక్కే వేరుగా ఉంటుంది . ఇక అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని అక్టోబర్ 11 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ప్రీ రిలీజ్ వేడుకకు చంద్రబాబు నాయుడు తో పాటుగా బాలకృష్ణ కూడా పాల్గొననున్నాడు. మొత్తానికి నందమూరి కుటుంబమంతా ఈ వేడుకలో కనిపించబోతున్నారు అన్న టాక్ ఇటు సినీ వర్గాలను, అటు పార్టీ శ్రేణులను ఉత్సాహంలో నింపేశాయి.

Facebook Comments