షాకింగ్: వైసీపీలో నాలుగు వికెట్లు డౌన్.. టీడీపీలో చేరిక

వైసీపీ అధినేత జగన్ పార్టీ నే నమ్ముకున్న నాయకులను నట్టేట ముంచుతూనే ఉన్నారు. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడు ఎవరిని పక్కన పెడతారో అర్థంకాక ఆ పార్టీ నాయకులు,నియోజకవర్గ ఇన్‌చార్జిలతో పాటు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సైతం ఎప్పుడేం జరుగుతుందో అని భయాందోళనలో ఉన్నారు. నియోజకవర్గాల ప్రజలు ఎన్నడూ ఎరగని కొత్త ముఖాలను తెరపైకి తెస్తున్న జగన్ ఎన్నో ఏళ్ళుగా పార్టీని నమ్ముకున్న వాళ్ళను కూడా నిర్మొగమాటంగా ఏరిపారేస్తున్నారు. జనాలని ఓదార్పు యాత్రల పేరుతో ఓదార్చే జగన్ సొంత పార్టీ నాయకులను కర్కశంగా తీసిపారేస్తున్నారు.

జగన్ తీరుతో వైసీపీలో కలకలం రేకెత్తుతోంది. ఇప్పటికే జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కొత్తవారిని రంగంలోకి దించి పార్టీ కేడర్‌ విమర్శలకు గురైనప్పటికీ జగన్‌ తన ధోరణి మార్చుకోవడం లేదు. గుంటూరు జిల్లాలో పార్టీని జగన్ తన నిర్ణయాలతో భ్రషు పట్టిస్తున్నాడని స్థానిక వైసీపీ నేతల్లో జోరుగా చర్చ సాగుతుంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ ని పక్కన పెట్టిన జగన్, గుంటూరు లో లేళ్ల అప్పిరెడ్డి ని దూరం పెట్టారు. దీనితో ఇప్పటికే ఈ రెండు స్థానాల్లో టిడిపి బలపడగా, తాజాగా మరొక నలుగురికి చెక్ పెట్టాడు జగన్ .
తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్‌ శ్రీదేవి పేరు ఖరారు చేశారట జగన్. దీంతో ఇక్కడ ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న కత్తెర క్రిస్టినాపై వేటు వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. క్రిస్టినా గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి తనకే సీటు అనే భావనలో ఉన్న క్రిస్టినా ఈ నాలుగేళ్ళుగా ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు బదులుగా తెరపైకి వచ్చిన డాక్టర్‌ శ్రీదేవి హైదరాబాద్‌లో స్థిరపడిన డాక్టర్‌గా చెబుతున్నారు. దీంతో క్రిష్టినా పని గందరగోళంగా మారింది. ఇక మొదటి నుండివీర విధేయుడిగా ఉన్న మంగళగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఓదార్పు యాత్రల సమయంలో ఎంతో వ్యయం చేసుకొని రాష్ట్రమంతటా పార్టీ అధినేత జగన్‌ను నీడలా వెన్నంటి పయనించైనా జగన్ మాట మీద అధికార పార్టీ పై పలు కేసులు వేసిన ఆర్కేని కూడా టికెట్ లేదు పొమ్మన్నాడు జగన్. దీంతో ఆర్కే జనసేనలో చేరేందుకు సిద్ధం అవుతున్నాడు.

గత ఎన్నికల్లో పెదకూరపాడులో పోటీ చేసి ఓడిన బ్రహ్మ నాయుడు ఆ నియోజక వర్గాన్ని వదిలేస్తే గుంటూరు నగరానికి చెందిన మాజీ కార్పొరేటర్‌ కావటి మనోహర్‌ నాయుడును సీటు నీదేనని నమ్మించి అక్కడికి జగన్‌ పంపారు. మూడేళ్ళుగా ఆ నియోజకవర్గంలో బలం పుంజుకునేందుకు అష్టకష్టాలు పడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్న సమయంలో కావటికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని జగన్ భావిస్తున్నాడు. దీంతో ఆయనకు నిద్రలేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా తుళ్లూరు మండలం పెదపరిమికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శంకరరావు పేరు పేద కూరపాడులో వినిపిస్తుంది..ఇక వేమూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మేరుగ నాగార్జునకు కూడా ఈ సారి సీటు కష్టమేనని అంటున్నారు. నాగార్జున ఓటమిపాలైనప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీకి సారథ్యం వహిస్తూ కేడర్‌కు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి రంగంలోకి దించేందుకు తగిన అభ్యర్థి ఎంపిక జరగలేదు. కానీ నాగార్జునకు ఎర్త్ మాత్రం పక్కా ..అదే విధంగా మరో ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు జనంలో ఇమేజ్‌ ఉన్నప్పటికీ ఆర్థిక స్తోమతలేదని వేటు వేసే పనిలో ఉన్నాడట జగన్. అసలు జగన్ వ్యవహారశైలి చూస్తే పార్టీ ని నిర్వీర్యం చేస్తున్నాడు అని స్థానిక నాయకులలో చర్చ జరుగుతుంటే వున్నది ఉంచుకున్నది రెండూ పోయేదాకా అలాగే చేస్తాడు అని నిట్టూరుస్తున్నారు సొంత పార్టీ నేతలు .

Facebook Comments