టీడీపీ చెసిన అతిపెద్ద తప్పు ఇదేనా..??

హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి మొన్న 21వ తేదిన ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. అయితే గత డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచాడు. అయితే అనంతరం ఆయన నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందడంతో మొన్న తిరిగి ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి, అధికార పార్టీ నుంచి సైది రెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావ కిరణ్మయి, తీన్మార్ మల్లన్న వంటి వారు ముఖ్యంగా బరిలో పాల్గొన్నారు.అయితే నేడు ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఫలితాలు వెలువడ్డాయి.

అయితే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతిపై 43,284 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే ఏపీలో ఈ సారి ఘోరంగా ఓడిపోయిన టీడీపీ కూడా అనూహ్యంగా తమ ఉనికి తెలుసుకోవాలని ఈ ఉప ఎన్నికలో చావ కిరణ్మయిని పోటీలో నిలిపింది. అయితే గత డిసెంబర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఈ ఉప ఎన్నికకు ఒంటరిగానే పోటీ చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే పోటీ అని తెలిసినా కూడా ఒక ప్రయత్నం చేయాలని, తిరిగి పార్టీ క్యాడర్‌ను నిర్మించుకోవాలని ఈ ప్రయత్నం చేసినట్టు అర్ధమవుతుంది. అయితే గతంలో టీడీపీకి అభిమానులు ఉన్న ఇప్పుడు మాత్రం అక్కడ టీడీపీ అభ్యర్థికి 1500వందల ఓట్లు మాత్రమే పోలయ్యి డిపాజిట్లు కూడా దక్కలేదనే చెప్పాలి. ఏదేమైనా టీడీపీ ఇక్కడ పోటీ చేసి తప్పుచేసిందనే వాదన రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.