వైసీపీ ఎంపీపై, టీడీపీ నేత షాకింగ్ కామెంట్…

ఎపీలో వైసీపీ నెతలు కోద్ది రోజులుగా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా  ప్రవర్తిస్తున్నారని  టీడీపీ నెతలు చేప్తున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కీలక నేత బుద్దా వెంకన్న, వైసీపీ పార్టీ ఎంపీ పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చాలా దుర్మార్గుడని, అతడు వ్యభిచారంలో సిద్దహస్తుడని, తన పోలీసు అధికారాన్ని అడ్డం పెట్టుకొని గోరంట్ల మాధవ్ చాలా అక్రమాలకూ పాల్పడ్డారని టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలనమైన వాఖ్యలు చేశారు.

 

అంతేకాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని గోరంట్ల మాధవ్ బెదిరించడం వల్లే కియా అనుబంధ సంస్ధలు వెళ్లిపోయాయని బుద్దా వెంకన్న ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం చేయడానికే, ఇంకా ఎక్కువగా సొమ్ము కాజేయాలని ఉద్దేశంతోనే మాధవ్ రాజకీయాల్లోకి వచ్చాడని ఆరోపించారు.ఇకపోతే ప్రజలందరూ కూడా వైసీపీ ఎంపీ మాధవ్‌ను హిందూపురం నుంచి తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. అంతేకాకుండా అమరావతి రెఫరెండం పై విశాఖ జిల్లాకు సంబందించిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, గుంటూరు ఎంపీ కూడా రాజీనామా కి సిద్ధమని బుద్దా వెంకన్న వాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాజధానిలోని వైసీపీ పార్టీ కి సంబందించిన నేతలను కూడా రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.