మావోల మరో లేఖతో ఏపీలో కలకలం.. టీడీపీ ఎమ్మెల్యే పై భారీ కుట్ర

పాడేరు ఎమ్మెల్యే మావోల హిట్ లిస్టు లో ఉన్నారు. తాజాగా ఆమెకు మావోలు హెచ్చరికలు జారీ చేశారు. అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ పై మావోయిస్టుల దుశ్చర్య మరిచిపోకముందే.. మరో హెచ్చరిక కలకలం రేపుతోంది.. టీడీపీ నాయకురాలు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని మావోయిస్టులు తీవ్రంగా ఓ హెచ్చరిస్తూ లేఖ రాశారు.

అందులో గిడ్డి ఈశ్వరి అధికార పార్టీకి తొత్తుగా మారారని, 20 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయి టీడీపీలో చేరినట్టు అందులో పేర్కొన్నారు మావోలు.అంతేకాదు తమకు నీతులు చెపుతారా అని ప్రశ్నించారు. ప్రజా కోర్టు సందర్భంగా ఈశ్వరి గురించి కిడారి చెప్పారని.. ఆమెకు అందిన నగదుని 2 నెలల్లోల గిరిజనులకు పంచేసి క్షమాపణలు చెప్పాలని.. లేదంటే కిడారి సర్వేశ్వరావు, సివేరి సోమలకు పట్టిన గతే పడుతుందని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో గూడ క్వారీని వదిలేయాలని చాలాసార్లు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హెచ్చరించామని అయినా వారు పట్టించుకోలేదని గుర్తు చేశారు. అలాగే బాక్సైట్‌ తవ్వకాలకు లోపాయికారీగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని.. అందుకే ప్రజాకోర్టులో శిక్షించామని మావోయిస్టులు అన్నారు. దీంతో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పోలీసు భద్రతను పెంచింది ప్రభుత్వం.

ఒక పక్క వైసీపీ , జనసేన నాయకుల విమర్శలు, మరో పక్క కేంద్రం కుట్రలు, ఇంకో పక్క చాప కింద నీరులా విస్తరించిన మావోలు … వారి హెచ్చరికలతో ఏపీ ప్రభ్త్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. గిడ్డి ఈశ్వరికి హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో ఒక్క సారి రాజకీయ నాయకులు ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. ఈశ్వరిని బయటకు వెళ్ళవద్దని పోలీసులు సూచించారు.

Facebook Comments