టీడీపీ నేతలను టార్గేట్ చేసిన వైసీపీ…

రాష్ట్రంలో ఇప్పుడు కక్ష్యా  రాజకీయాలు ఎక్కువవుతున్నాయని ఆయన తెలిపాడు.ఏపీ సీఎం గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భాద్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా పాలనాపరంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.ఆయన తీసుకొనే నిర్ణయాలు ప్రతి సారి కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి.తాజాగా ఆయన మాజీ ప్రజా ప్రతినిధుల భద్రతా కుదింపు అంశం పై కూడా ఆయన కీలక నిర్ణయం తీసుకొనున్నట్లు తెలుస్తుంది.ఏపీలో మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పూర్తి స్థాయిలో గన్‌మెన్లను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

 

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విపక్ష నేతల భద్రత కుదింపు అంశం తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అధినేత,మాజీ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు కు ఆయన కుటుంబ సభ్యులకు కేటాయించిన భద్రతను ఇప్పటికే కుదించడం తో ఈ వ్యవహారం కోర్టుకు వరకు వెళ్లింది.అయితే ఇలా మాజీలకు భద్రత ఉపసంహరించుకోవాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంటే అది టీడీపీ నేతలకు ఇబ్బంది కలిగించే పరిణామంగా మారుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.అంతేకాకుండా మాజీ లు అందరికి కూడా వారి భద్రత ను కుదించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది.ఒకవేళ జగన్ సర్కార్ మాజీలకు గన్‌మెన్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయిస్తే… టీడీపీతో పాటు కాంగ్రెస్ నేతల కు కూడా భద్రత కొనసాగుతున్న నేపథ్యంలో వారు కూడా వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉంది.మరి దీనిపై జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.