టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు.. వేడెక్కిన అమరావతి…

ఏపీలో అమరావతి ప్రజల కోసం  చేస్తున్న నిరసనలకు అడ్డుగా వస్తుంది.అమరావతిలో ఛలో అసెంబ్లీ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ ‌లు చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆదివారం రాత్రి వరకు 48 నియోజకవర్గాల్లో టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. గృహనిర్బంధాలను, అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. టీడీపీ, జేఏసీ నేతలను నిర్బంధించడం హేయమైన చర్య అంటూ విమర్శించారుజ నిరసన తెలిపే హక్కు వైసీపీ వాళ్లకే కాదు దేశ పౌరులందరికీ ఉందన్నారు. ఈ విధమైన అణచివేత చర్యలు అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమన్నారు చంద్రబాబు. అత్యవసర పరిస్థితుల్లోనూ దేశంలో ఇంత నిర్బంధం లేదన్నారు. తక్షణమే గృహనిర్బంధాలను ఎత్తివేయాలి చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులను ఆపాలన్నారు.