టీడీపీ, కేంద్రాన్ని బాగా ఇరికిస్తుందిగా…?

ఏపీలో ఇప్పుడు రాజకీయాలు కాస్త వేడేక్కాయని అందరికి తేలిసిన విషయమే..మొన్నటి వరకు బీజేపీతో సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీతో పొత్తుకోసం గట్టిగా ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ కి ఊహించని విధంగా జనసేన బీజేపీలు పొత్తు పెట్టుకోవడం షాక్ కలిగించింది.అందుకే ఇకపై బిజెపి ని కూడా రాజకీయ ప్రత్యర్థి గానే చూసేందుకు ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టింది.ఏపీలో ప్రస్తుతం రాజధాని వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.ఈ అంశంలో బిజెపిని ఇరికించేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది.ఏపీ బీజేపీ నేతలు రాజధాని వ్యవహారంపై ఇప్పటికే స్పందించారు.అమరావతి నుంచి రాజధాని తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నామని, అవసరమైతే రైతుల కోసం పాదయాత్ర చేసి అండగా ఉంటామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

 

ప్రస్తుతం జనసేన- బిజెపి పొత్తు పెట్టుకున్న తర్వాత అమరావతి విషయంలో కలిసి పోరాటం చేస్తామని చెప్పిన తరువాత టిడిపి మరింత దూకుడు పెంచింది.అందుకే రాజధాని వ్యవహారంలో తమకు సంబంధం లేదు అన్నట్టుగా బీజేపీ పెద్దలు మాట్లాడడాన్ని మొదటిసారిగా తప్పుపట్టింది టీడీపీ.రాష్ట్రానికి న్యాయం చేయగల స్థాయిలోనూ, స్థానంలోనూ ఉన్న బిజెపి ఇప్పుడు తప్పించుకునే ధోరణిని అవలంబించడంపై టిడిపి నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శిస్తున్నారు.జగన్ తీసుకున్న నిర్ణయాలు కూడా పయ్యావుల కేశవ్ విమర్శించారు.అసలు కేంద్రం పరిధిలో ఉన్న హైకోర్టు ను తరలిస్తామని జగన్ ప్రకటించినా బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.కేంద్రానికి చెప్పకుండా తాము నిర్ణయం తీసుకోవడం లేదని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అనేకసార్లు చెప్పారని, కేంద్రం అనుమతి తోనే రాజధాని మార్పు జరుగుతోందని వైసీపీ అంతర్గత సమావేశాల్లో నాయకులు మాట్లాడుకుంటున్నారు అన్న విషయాలు కూడా పయ్యావుల కేశవ్ హైలెట్ చేశారు.

 

అసలు బిజెపి తలుచుకుంటే రాజధాని అంశం సర్దుమణిగిపోతుందని, ఇది చాలా చిన్న విషయమని అయినా బీజేపీ పట్టించుకోకుండా ఈ వ్యవహారం మరింత ఉదృతం అయ్యేందుకు కారణం అవుతోందని పయ్యావుల విమర్శిస్తున్న బీజేపీ నాయకులు మాత్రం నోరు మెదపడంలేదు.