టీడీపీలోకి ముద్రగడ..! చర్చలు అందుకేనా..?

కాపు ఉద్యమాన్ని నడిపిస్తున్న నేత ముద్రగడ పద్మనాభం కాపు సంక్షేమానికి కృషి చేసి, కాపు రిజర్వేషన్ హామీ ఇచ్చే పార్టీకే కాపుల మద్దతు ఉంటుందని ప్రకటించారు.తాము ఏ పార్టీకి సపోర్ట్ చేస్తామో కాపు జేఏసీ నేతలతో చర్చించి నిర్ణయిస్తామని చెప్పిన ముద్రగడ టీడీపీలో చేరే అవకాశం బాగా కనిపిస్తుంది. కాపు రిజర్వేషన్స్ కోసం ముద్రగడ పద్మనాభం గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ఆయన మొదట చంద్రబాబు కి వ్యతిరేకంగా గా మాట్లాడుతూ, జగన్ కి జేజేలు కొట్టారు. ఆ తర్వాత జగన్ కాపు రిజర్వేషన్స్ మీద యూ టర్న్ తీసుకోవటంతో ముద్రగడ షాక్ కి గురి అయ్యారు. పవన్ మరొక సారి అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవటం, జగన్ కేంద్రానికి సాగిలా పడటంతో ముద్రగడ కు అన్ని దారులు మూసుకుని పోయాయి. ఆ పార్టీ కంటే ఈ పార్టీ నే బెటర్ అని భావించాడో ఏమోగానీ తాజాగా కాపు ఉద్య‌మ నేత స్వ‌రం మారింది. అందుకే నిన్నామోనా వరకు చెలరేగిపోయిన కాపు ఉద్యమనేత ఆచితూచి మాట్లాడారు.

ఒక‌ప్పుడు హెచ్చ‌రిక‌లు, బెదిరింపులు, డెడ్ లైన్ల‌తో దూకుడు చూపించిన చంద్రబాబు పై విమర్శలు చేసిన ప‌ద్మ‌నాభం ఈసారి దానికి భిన్నంగా విన‌తులు, విజ్ఞాప‌న‌లు, ఆఫ‌ర్లు ఇవ్వ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. చంద్ర‌బాబుకి సన్మానం చేస్తాన‌నే వ‌ర‌కూ వ‌చ్చింది. ముద్ర‌గ‌డ మ‌న‌సు మారింద‌నే వాద‌న‌కు ఆయన తీరే బ‌లం చేకూరుస్తోంది. పూర్తిగా ప్ర‌భుత్వానికి విన్న‌వించ‌డానికే ప‌రిమితం అయిన‌ట్టుగా ఆయన తీరు ఉండటంతో ముద్రగడ టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారా అన్న చర్చ సాగుతుంది.

సుతిమెత్త‌టి వ్యాఖ్య‌లే త‌ప్ప నేరుగా చంద్ర‌బాబు మీద సూటిగా విరుచుకుప‌డిన దాఖ‌లాలు ఇక క‌నిపించ‌వ‌నే రీతిలో సాగిన ముద్రగడ తీరు అందుకు బలం చేకూర్చింది. అన్నింటికీ మించి కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో త‌మ డిమాండ్ల అంగీక‌రించాల‌ని విన్న‌వించిన ముద్ర‌గ‌డ, అది జ‌రిగితే చంద్ర‌బాబుకి స‌న్మానం చేస్తామ‌ని, 10ల‌క్ష‌ల మందితో స‌భ పెట్టి, సీఎంని నెత్తిన పెట్టుకుంటామ‌ని హామీ ఇచ్చారు. కాపులు అందరు తెలుగుదేశంతో ఉండటమే కాకుండా, తానూ తెలుగుదేశం తీర్ధం పుచ్చుకుంటా అని సైతం వ్యాఖ్యలు చేశారు. కాపులకు పూర్తిన్యాయం చేస్తారని నమ్మకం కల్పించిన వారికే మద్దతిచ్చేలా డిసెంబరులో జేఏసీ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం ప్రకటించనున్నట్టు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. వచ్చే నెలలో 13 జిల్లాల కాపు నాయకులతో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ముద్రగడ చంద్రబాబు ఇచ్చిన హామీలు నేరవేర్చాలని కోరారు. ముద్రగడలో మాటల వాడి వేడి లేకపోవటం కేవలం చంద్రబాబుకు వినతి మాత్రమె చెయ్యటం చూస్తే టీడీపీలో చేరటం పక్కా అని తెలుస్తుంది. అయితే ఏపీలో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మరి ముద్రగడ ఏం చేస్తారో తెలియాలంటే మరికొంత కాలం ఆగాలి.

Facebook Comments