తెలంగాణాలో జనసేన పోటీనా ..? అసలు పార్టీ ఉందా..?

తెలంగాణాలో జనసేన పోటీ చేస్తుంది ! బలమైన స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది ! కాదు కాదు ముందస్తు ఎన్నికలు వస్తాయని మేము ఊహించలేదు. అందుకే ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడంలేదు. ఇలా రకరకాల ప్రకటనలతో అయోమయం లో ఉన్న ఆ పార్టీ కి ఏ విషయంలోనూ క్లారిటీ మాత్రం రావడంలేదు. అందుకే జనసేన పార్టీ జనాల్లో నమ్మకాన్ని పొందలేకపోతోంది. అయినా ఆ పార్టీ నేతలు మాత్రం తీరిగ్గా మేము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మీటింగ్ లు పెట్టుకుంటున్నాం… ఏ సంగతి త్వరలోనే చెపుతాము అంటూ సర్ది చెప్పుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా లో మాత్రం పవన్ పార్టీ మీద సెటైర్లు గట్టిగానే పడుతున్నాయి. వీటికి సమాధానం చెప్పుకోలేక ఆ పార్టీ నేతలు అయోమయానికి గురవుతున్నారు.

అయితే తెలంగాణాలో జనసేన పార్టీ పోటీ చేస్తుందో లేదో తెలియక కొంతమంది ఆ పార్టీ ఆఫీస్ చుట్టూ టికెట్ల కోసమా చెక్కెర్లు కొడుతున్నారు. తమ పార్టీ భావజాలానికి, సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసేవారికె టికెట్లు ఇస్తాం. ఏఏ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నామో ? ఎక్కడ నుంచి పోటీ చేయాలో ? ఎక్కడ సీట్లు సర్ధుబాటు చేసుకోవాలో ? అన్ని ఆలోచనలూ చేస్తున్నాం. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఇప్పటికే చర్చలు జరిగాయి. ముందు ముందు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ చర్చలు ముందుకెళ్తాయి..అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ( పొలిటికల్ అఫైర్స్ కమిటీ) ప్యాక్, చెప్పుకొస్తోంది.

తెలంగాణలో జనసేన బలాబలాలపై అంచనా వేసేందుకు ప్యాక్ చర్చలు జరిపింది. తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని సీతారాంతో మంతనాలు జరిపాం. ఆ చర్చల సారాంశాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కు అందజేశాం. ఆ చర్చలు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలున్నాయని, మరోసారి పవన్ స్వయంగా కూర్చుని మాట్లాడితే పొత్తుపై ఓ స్పష్టత వచ్చేస్తుందని జనసేన ప్యాక్ చెప్పుకొచ్చింది. అయితే సోషల్ మీడియా యూజర్లు మాతరం మాములుగా ఏకడంలేదు. తెలంగాణాలో జనసేన పార్టీ ఉందా ? అంటూ అమాయకంగా ప్రశ్నలు వేస్తూ కామెడీ పండిస్తున్నారు. ఏనాడైనా తెలంగాణ ప్రభుత్వాన్ని వివిధ సమస్యల మీద ప్రశ్నించారా అంటూ .. నిలదీస్తున్నారు. అవేమి చేయకుండా కేసీఆర్ పాలనా అద్భుతం నామొహం అంటూ… పొగుడుతూ… ఆయనకు భజన చెయ్యడమే పవన్ పనిగా పెట్టుకున్నాడు అంటూ తిట్టిపోస్తున్నారు.

Facebook Comments