తెలంగాణలో కింగ్‌ మేకర్‌గా టీటీడీపీ… కేంద్ర ఐబీ రిపోర్ట్‌లో సంచలనాలు…!

తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనాలు నమోదు కానున్నాయా…? వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని తొందరపడి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేశారా.? ఆయన వ్యూహం బూమరాంగ్‌ కానుందా…? ప్రస్తుత పరిస్థితులలో ఆ పార్టీ మేజిక్‌ మార్క్‌ని సైతం దాటే సీన్‌ కనిపించడం లేదా..? ఇవే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్‌ చేస్తున్నాయి. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల కోసం అసెంబ్లీని రద్దు చేసి నెల రోజులు దాటింది.. తాజా పరిణామాలపై కేంద్రం రిపోర్ట్‌ ఇవ్వాలని ఇంటెలిజెన్స్‌ బ్యూరోని ఆదేశించిందట.. రీసెంట్‌గా చేసిన ఈ సర్వే కేసీఆర్‌కి వార్నింగ్‌ బెల్స్‌ పంపుతోందని, ఇటు బీజేపీ నేతలను హెచ్చరిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి..

లేటెస్ట్‌ ఐబీ అంచనాలతో బీజేపీ హైరానా పడుతోందట.. గులాబీ దళపతి కేసీఆర్‌ని సైతం అలెర్ట్‌ చేసిందనే ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌ 40-50 సీట్లకే పరిమితం అవుతుందనే రూమర్‌ వినిపిస్తోంది.. అంటే, తెలంగాణలో హంగ్‌ ఏర్పడే చాన్స్‌లు పుష్కలంగా కనిపిస్తున్నాయట.. ఇదే నిజమైతే కింగ్‌ మేకర్‌గా టీటీడీపీ అవతరించనుందనే భావన నెలకొంది.. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలతోపాటు ఖమ్మం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో సైకిల్‌ పార్టీకి మంచి పట్టుంది.. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తే టీటీడీపీకి మినిమమ్‌ 15 స్థానాలు రావొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.. అంటే, కింగ్‌ మేకర్‌గా మారడం గ్యారంటీగా కనిపిస్తోంది.. కాంగ్రెస్‌ సైతం సోలోగా విజయం సాధించే చాన్స్‌లు కనిపించడం లేదట.. ఆ పార్టీ సైతం 40-50 స్థానాలకే పరిమితం కానుందట.. ఇక ఎమ్‌ఐఎమ్‌ 5-7 చోట్ల ఆ పార్టీ జెండా ఎగురవేయనుంది.. బీజేపీకి 2-3 స్థానాలు వస్తాయని ఐబీ అధికారులు రిపోర్టులు ఇచ్చారట.

ఐబీ సర్వే బీజేపీ అధిష్టానం చేతిలో పడిందో లేదో తమ గేమ్‌ ప్లాన్‌ మార్చారని, హుటాహుటిన మఠాధిపతి పరిపూర్ణానందని హస్తినకి పిలిపించారని సమాచారం. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం ఊపందుకోగానే ఏకంగా 15 మంది సీఎంలను తెలంగాణలో ప్రచారం చేయించాలనే భావనకు వచ్చారట కమలనాధులు.. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ… మొత్తమ్మీద, తెలంగాణలో టీటీడీపీకి గోల్డెన్‌ చాన్స్‌ దక్కనుందనే ప్రచారం హోరెత్తుతోంది.. మరి, ఈ పట్టును నిలుపుకోవడానికి చంద్రబాబు ఎలాంటి ఎత్తుగడలు అనుసరిస్తారో చూడాలి..

Facebook Comments