తెలంగాణపై కేంద్రానికి ప్రత్యేక ప్రేమకు కారణం ఇదేనా..?

ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం సవతి తల్లి ప్రేమ కూడా చూపించలేకపోతుంది. ఇక నిన్నా మొన్నటి దాకా మోడీ గాడెవ్వడు అని తిట్టిన కేసీఆర్ పై లేని ప్రేమను ఒలకబోస్తుంది. కేవలం అధికారం కోసం.. కేవలం ఏపీ సీఎం చంద్రబాబు ను దెబ్బ కొట్టటం కోసం. ఏపీకి నిధులివ్వకుండా ఇబ్బంది పెడుతూ తెలంగాణాకు మాత్రం నిధుల వర్షం కురిపిస్తుంది కేంద్ర సర్కార్ .

ఏపీకి కేంద్రం మరోసారి తన మొండి చేయి చూపించి అక్కసుని బయటపెట్టింది. రాష్ట్రానికి రావాల్సిన వాటిని మరోసారి కేంద్రం అడ్డుకుంది. ఆంధ్రప్రదేశ్‌ లో వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల విషయంలో కూడా ఏపీని ఒకలా, తెలంగాణాను ఒకలా చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన మొత్తం ఏడు జిల్లాలకు ఈ ఏడాది మార్చిలో రూ.350 కోట్లను విడుదల చేసిన మోదీ ప్రభుత్వం యూసీలు, ఖర్చుల వివరాలు అందించని కారణం అంటూ ఓ సాకు చెప్పి వాటిని వెంటనే ప్రధాని కార్యాలయం చెప్పిందని అధికారులు డెబిట్ చేసుకున్నారు. దీనిపై తక్షణమే దీనిపై స్పందించిన రాష్ట్ర సర్కార్ మార్చి నెలాఖరు కల్లా యూసీలు, ఖర్చుల వివరాలను అందించింది. ఇది జరిగి దాదాపు ఆరు నెలలు గడిచినా కాని ఇప్పటి వరకు ఆ నిధుల విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అయితే ఏపీతో పాటు పెండింగ్‌లో పెట్టిన తెలంగాణకు చెల్లించాల్సిన రూ.450 కోట్ల నిధులను మాత్రం వారం రోజుల క్రితమే విడుదల చేసింది.

కేంద్ర ఆర్థిక, డీవోపీటీ అధికారులు ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. కాని ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ఏ నిర్ణయం వెల్లడించలేదు.ఏపీలో వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.50 కోట్లు చొప్పున మొత్తం రూ.350 కోట్లు ఇవ్వాల్సి వుంది. కానీ అవి అతీగతీ లేవు.తెలంగాణలో పాత జిల్లాల ప్రకారం తొమ్మిది జిల్లాలకు రూ.450 కోట్ల మేర చెల్లిస్తూ వస్తోన్న కేంద్రం ఇప్పుడు కూడా తెలంగాణాపై ప్రేమ చూపించి ఏపీ ని అన్యాయం చేసింది. కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ కి అండగా ఉంటాడని, అధికారం లోకి రావటానికి కేసీఆర్ సహకరిస్తాడనే కారణమే బీజేపీ ప్రేమకు ప్రధాన కారణం.

Facebook Comments