తెలుగు రాష్ట్రాల సీయంలు భేటీ..?

తెలుగు రాష్ట్రాల సీయంలు మరోకసారి కలవనున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు జగన్, కేసీఆర్ ఇద్దరూ గత కొంతకాలంగా ఎంతో అన్నోన్యంగా మెలుగుతూ ఉండడమే కాకుండా మంచి స్నేహపూర్వక వాతావరణంలో ఇరు రాష్ట్రాల సమస్యల మీద చర్చించుకుంటూ ఒక పరిష్కారాన్ని వెతుకుతున్నారు.ఇప్పటికే ఈ ఇద్దరూ అనేకసార్లు భేటీ అయ్యి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు, పంపకాలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారులతో కలిసి చర్చించి ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఒక అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే.ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈనెల 13వ తేదీన భేటీ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

ఈ మేరకు ఈ నెల 13వ తేదీన హైదరాబాదులోని ప్రగతి భవన్ లో కేసీఆర్ తో జగన్ భేటీ కాబోతున్నట్టు సమాచారం.గతంలో జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించగానే తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చి ఆర్టీసీ కార్మికులు చాలాకాలం సమ్మెబాట పట్టారు.దీంతో కేసీఆర్ చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నారు.దీనికి పరోక్షంగా జగన్ కారణం అయ్యారనే కోపం కూడా కేసీఆర్ లో ఉంది.తాజాగా రాజధాని అమరావతిపై రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇరువురి భేటీపై ఆసక్తి నెలకొంది.