జబర్దస్త్‌ నుంచి ఆ ఇద్దరు ఔట్‌… బయటకు పొమ్మన్న నాగబాబు….!

జబర్దస్త్‌… టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని రియాలిటీ షో. అడల్ట్‌ జోక్స్‌ కంటెంట్‌తో మొదట అందరి అటెన్షన్‌ డ్రా చేసిన ఈ రియాలిటీ షో తెలుగు బుల్లితెరపై తిరుగులేని రేటింగ్స్‌ దక్కించుకుంది. యూ ట్యూబ్‌లోనూ సంచలన వ్యూయర్‌ షిప్‌ దక్కించుకుంటూ దూసుకుపోతోంది.. జబర్దస్త్‌లో కామెడీ పరంగా, షో పరంగా ఎలాంటి చేంజెస్‌ లేకున్నా… ఆర్టిస్టుల పరంగా ఎందరో మారారు.. మరెందరో తెరపైకి వస్తున్నారు. రీసెంట్‌గా రంగస్థలం మహేష్, రచ్చ రవి వంటి కమెడియన్‌లు జబర్దస్త్‌కి గుడ్‌ బై చెప్పి బిగ్‌ స్క్రీన్‌పై లక్‌ పండించుకుంటున్నారు..

ఈ లిస్టులోకి తాజాగా మరో ఇద్దరు స్టార్‌ జబర్దస్త్‌ కమెడియన్‌లు చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.. సుడిగాలి సుధీర్‌ ఈ లిస్టులో ముందున్నాడట. సుడిగాలి సుధీర్‌ ప్రస్తుతం పలు షోలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.. పోవే పోరా, ఢీ 10 వంటి షోలు చేస్తున్నాడు.. ఇవే కాకుండా సినిమాలలోనూ తళుక్కున మెరుస్తున్నాడు. వీటన్నింటికీ తోడు, ఫారిన్‌లో తెలుగు ఈవెంట్‌లంటే సుడిగాలి సుధీర్‌ పేరు మస్ట్‌గా మారుతోంది.. వీటితో ఆయనకు భారీగా పైకం ముడుతోంది.. జబర్దస్త్‌తో బిజీగా ఉండడంతో ఫారిన్‌ ఈవెంట్‌లకు టైమ్‌ అడ్జస్ట్‌ చేయలేకపోతున్నాడట సుధీర్‌.. ఈ విషయాన్ని జడ్జ్‌ నాగబాబుతో షేర్‌ చేసుకోగా… జబర్దస్త్‌కి గుడ్‌ బై చెప్పాలని, కొత్తవారిని ఎంకరేజ్‌ చేసినట్లు ఉంటుందని సలహా ఇచ్చాడట.. జీవితంలో ఇదే సరైన టైమ్‌ అని సుధీర్‌ని ఎంకరేజ్‌ చేసినట్లు సమాచారం.

ఇదే మాటను మరో టాప్‌ కమెడియన్‌ హైపర్‌ ఆదికి సైతం సెలవిచ్చాడట మెగా బ్రదర్‌ నాగబాబు.. ప్రస్తుతం నాగబాబుకి వరసగా సినిమాలు వస్తున్నాయి.. ఇదంతా ఆయనకు జబర్దస్త్‌ నుంచి క్రేజ్‌ అని స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.. అయితే, కొన్ని సినిమాలను ఆయన వదులకుంటున్నారు.. కేవలం ఈ షోతో ఎంగేజ్‌ కావడమే. కానీ, హైపర్‌ ఆది లాంటి వారికి మంచి ఫ్యూచర్‌ ఉంది. సినిమాలకు స్టోరీలు, స్క్రిప్ట్‌లు, డైలాగులు రాయడంతోపాటు నటనతోనూ ఆయన పేరు తెచ్చుకోవచ్చు.. అందుకే, ఆదిని సైతం ఫ్యూచర్‌లో మరింత పైపైకి ఎదగాలంటే చాన్స్‌ల కోసం పోరాడాలని, రంగస్థలం మహేష్‌ని చూసి నేర్చుకోవాలని సజెస్ట్‌ చేశాడట.. దీంతో, త్వరలోనే ఈ ఇద్దరూ జబర్దస్త్‌ షో నుంచి బయటకు వెళ్లాలని సూచించాడట.. మరి, ఈ ఇద్దరు ఎప్పుడు ఈ కామెడీ షోకి గుడ్‌ బై చెబుతారో చూడాలి..

Facebook Comments