బ్రేకింగ్: టీఆర్‌ఎస్‌కు మరోకరు గుడ్ బై?

మలి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్రియాశీలక పాత్ర పోషించిన డాక్టర్‌ శంకర్‌నాయక్‌ టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనతో పాటు పలువురు ఉద్యమకారులు కూడా పార్టీని వీడబోతున్నారని ఆదివారం శంకర్‌నాయక్‌ విడుదల చేసిన ఓ ప్రకటనతో తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన శంకర్‌నాయక్‌.. కొత్తగూడెం సింగరేణి ప్రధాన వైద్యశాలలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. తొలి నుంచి తెలంగాణవాదాన్ని బలంగా వినిపించిన ఆయన సింగరేణి ప్రాంతంలో మలి దశ ఉద్యమంలో కీలకపాత్ర పోషంచారు.

ఈ క్రమంలోనే ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావం, 2014 ఎన్నికల తర్వాత పార్టీ సానుభూతి పరుడిగా ఉన్న ఆయన కార్యక్రమాల్లో అంతగా పాల్గొనడం లేదు. అయితే పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో… ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించి.. ఉద్యమకారులను టీఆర్‌ఎస్‌ నేతలను అణగదొక్కుతున్నారని, తద్వారా తమ లాంటి వారు మానసికంగా వేదన అనుభవిస్తామని.. ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌.. అసలైన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, పార్టీలో సామాజిక న్యాయంలేదని, ఉద్యమకారులను పక్కన పెట్టి.. అసలు ఉద్యమంలోనే పాల్గొనని నేతలకు అవకాశాలు కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విధానాలతో తాము మనస్తాపం చెందామని, తనతో పాటు పలువురు ఉద్యమకారులు గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమయ్యామని ఆయన పేర్కొన్నారు.

Facebook Comments