టీఆర్ఎస్ కు భారీ షాక్ ….మరో వికెట్ డౌన్

టీఆర్ఎస్ పార్టీ కి కేసీఆర్ కు ఒక మాజీ ఎమ్మెల్యే షాక్ ఇవ్వబోతున్నారు. అదీ ఎక్కడో కాదు సాక్షాత్తు సీఎం సొంత నియోజక వర్గం లో . కేసీఆర్ విధానాలు నచ్చక హస్తం గూటికి చేరబోతున్నాడు ఆ నేత. హస్తం గూటికి చేరేందుకు ఇప్పటికే చర్చలు జరిపిన ఆ నేత మరెవ్వరో కాదు .

టీఆర్‌ఎస్‌ నేత, గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే, రోడ్ల అభివృద్ది సంస్థ చైర్మన్‌ తూంకుంట నర్సారెడ్డి సొంత గూటికి వెళ్లన్నుట్లు సమాచారం. కొంతకాలంగా టీఆర్‌ఎస్‌ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్న ఆయన మంగళవారం పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేయనున్నట్లు, రెండు రోజుల్లో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిసింది. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి తన అనుచరగణంతో కలిసి టీఆర్‌ఎస్ లో చేరిన నర్సారెడ్డి అప్పటి నుండి ఇప్పటి వరకు కోడా పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు, తన అనుచరులకు పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించలేదని, ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైనా తనను ఎవరూ పట్టించుకోలేదన్న ఆవేదనలో ఉన్నట్లు సమాచారం.

ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని నర్సారెడ్డి ఇంటికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వచ్చి కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. భేటీలో వంటేరు ప్రతా‌పరెడ్డి ఉండడం గమనార్హం. అయితే ఉత్తమ్‌ తనను పరామర్శించడానికి వచ్చారని నర్సారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఏది ఏమైనా తూంకుంట నర్సారెడ్డి తనను పట్టించుకోని టీఆర్ఎస్ ను వీడి తన పట్ల ఇంకా అభిమానం ఉన్న కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Facebook Comments