స‌బ్బం హ‌రికి ఊహించ‌ని బిగ్ షాక్…..

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆయన కీలక నేత. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మిన బంటు స‌బ్బం హ‌రి..ఆంధ్ర‌ప్రదేశ్ రాజ‌కీయాల్లో ఆయ‌న అంద‌రికీ సుప‌రిచిత‌మైన ఆయనకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌ అయిన సబ్బం హరి ఆస్తులు స్వాదీనం చేసుకుంటామని ఏకంగా ఒక బ్యాంకు నోటీసులు జారీ చేసింది.

విశాఖప‌ట్నం రాజకీయాల్లో చక్రం తిప్పగల నేత అయిన సబ్బం హరి అక్కడ మేయ‌ర్‌గా ప‌నిచేశారు. స్థానికంగా మంచి పట్టు ఉంది. విశాఖ‌ప‌ట్నంలో వైఎస్ విజ‌య‌మ్మ ఓడిపోవ‌డానికి స‌బ్బం హరినే ప్రధాన కార‌ణం అంటే అక్కడ ఆయనకున్న పట్టెంతో అర్ధం చేసుకోవాలి. 2009లో అన‌కాప‌ల్లి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఎంపీగా గెలుపొంది పార్ల‌మెంట్‌లో అడుగుపెట్టారు. ఇక ఆ త‌ర్వాత కిర‌ణ్ కుమార్ రెడ్డి స్ధాపించిన జై స‌మైకాంధ్ర పార్టీలో చేరారు. 2014 ఎన్నిక‌ల్లో విశాఖ‌ప‌ట్నం ఎంపీగా ఆ పార్టీ నుంచి బ‌రిలోకి దిగాల‌ని మొద‌ట భావించారు. కానీ ఆ త‌ర్వాత పోటీ నుంచి త‌ప్పుకుని కంభంపాటి హ‌రిబాబుకు మ‌ద్ద‌తు తెలిపారు.

అప్పటి నుండి ఇప్పటి వరకు స్తబ్దు గా ఉన్న సబ్బం హరి రానున్న ఎన్నిక‌ల్లో మ‌రోసారి క్రియాశీల రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి అడుగుపెడ‌తాన‌ని,పోటీలోకి దిగుతాన‌ని ఇప్ప‌టికే సబ్బం ప్ర‌క‌టించారు. అయితే ఏ పార్టీలో చేర‌తాన‌నేది త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాన‌న్న ఆయన టీడీపీ వైపే మొగ్గు చూపారు. ఆయ‌న టీడీపీలో చేర‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల నాటికి స‌బ్బం హ‌రి టీడీపీలో చేర‌తార‌నే ప్ర‌చారం సాగుతోంది.దాదాపు టికెట్ కూడా కన్ఫార్మ్ అని చర్చ జరుగుతుంది.
ఈ నేప‌థ్యంలో స‌బ్బం హ‌రికి ఊహించ‌ని షాక్ ఇచ్చింది విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంకు. స‌బ్బం హ‌రి ఆస్తుల‌ను స్వాధీనం చేస్తూ విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. ఈ మేర‌కు ఆస్తుల‌ను త‌నఖా పెట్టి బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించ‌లేదంటూ ఆస్తుల‌ను స్వాధీనం చేస్తూ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. మొత్తం వడ్డీతో కలిసి రూ. 9.54 కోట్లు ఆయ‌న బ్యాంకుకు చెల్లించాల్సి ఉంది. విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంకు 60 రోజుల్లోగా డబ్బు చెల్లించకపోతే సీతమ్మధారలోని 1622 చదరపు గజాల స్థలంలోని నివాసంతో పాటు,విశాఖ బీచ్‌రోడ్‌లోని రుషికొండ దగ్గరలో ఉన్న 800 చదరపు గజాల స్థలాన్ని, మాధవధారలోని వుడా లేఅవుట్లో 444 చదరపు అడుగుల విస్తీర్ణంలోని విష్ణు వైభవం అపార్టుమెంట్ ను స్వాధీనం చేసుకుంటామని నోటీసులో పేర్కొంది.

Facebook Comments