ఉత్తమ్ పై కాంగ్రేస్ అధిష్టానం అలోచన ఇదేనా..??

ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రేస్ పీసిసీ చీఫ్ ఉత్తమ్ పదవి వుంటుందా లెక ఉడుతుందా అని తెలంగాణా కాంగ్రేస్ నెతలు అనుకుంటున్నారు.తెలంగాణాలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరాజయాన్ని కూడగట్టుకున్న సంగతిమనకు తెలిసిందే. కాగా ఆ తరువాత జరిగినటువంటి పరిణామాల కారణంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ని ఆ పదవి నుండి తగ్గిస్తారని అప్పట్లో వార్తలు బాగానే వచ్చాయి. కానీ తెలంగాణాలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్ ఎంపీగా విజయం సాధించడంతో పాటు, తెలంగాణాలో మూడు ఎంపీ సీట్లలో విజయం సాధించడంతో మళ్లీ కాంగ్రెస్ అధిష్టానం ఉత్తమ్ విషయంలో మరొకసారి పునరాలోచనలో పడ్డట్లు సమాచారం.

అయితే అదేనమ్మకంతో తెలంగాణాలో మరికొద్ది రోజుల్లో జరగబోయే ఉపఎన్నికకు ఉత్తమ్ తన భార్య పద్మావతిని నిలబెట్టుకున్నాడు. ఇకపోతే ఈ ఉపఎన్నికలో తన భార్యని గెలిపించడమే ఇపుడు ఉత్తమ్ ముందున్న ప్రధాన లక్ష్యం. అయితే ఈ ఎన్నికలో ఉత్తమ్ భార్య గనక ఓడిపోతే ఉత్తమ్ ని తన పదవి నుండి తొలగించే అవకాశాలు లేకపోలేదు. అయితే తన సొంత నేతలే ఉత్తమ్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఉత్తమ్ కి వయసు అయిపోయిందని, కొత్త నాయకుడు కావాలని పలురకాల విమర్శలు చేస్తున్నారు. కానీ తన పదవికి, ఉపఎన్నికకు ఎలాంటి సంబంధం లేదని, ఎలాగైనా సరే ఉపఎన్నికలో గెలిచి కాంగ్రెస్ సత్తా చాటుతామని ఆయన ఉత్తమ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎం జరుగుతుందో చూడాలి మరి.ఒకవేళ్ పద్మావతి హుజుర్ నగర్ ఉప ఎన్నికలలో గెలిస్తే ఇక ఉత్తమ్ పదవికి ఢోకా వుండదు అని అయన అనుచరులు అనుకుంటున్నారు.

Facebook Comments