విజయ్ సాయి రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నెత…

విజయసాయిరెడ్డి ప్రతి పక్షాల పై చేస్తున్న విమర్శలకు టీడీపీ లీడర్ బుద్ద వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. మానసిక పరిణితి గురించి మాట్లాడి టీడీపీ నేతల ఆగ్రహ జ్వాలలకు విజయసారి రెడ్డి సైలెంట్ అయ్యారు. మానసిక పరిణీత అంటే ఏమిటి విజయసాయిరెడ్డి గారు అంటూ ప్రశ్నించారు. తండ్రి శవం దగ్గరికి వెళ్లకుండా సంతకాలు చేయించడమా? తాను ఎంపీ అవ్వడానికి బాబాయ్ ని రాజీనామా చేయమని ఒత్తిడి చేయడమా? పెద్ద రోగం తో పోయిన వారిని తండ్రి కోసం పోయారు అంటూ బుగ్గలు నిమరడమా?

తాను గెలవడమే ముఖ్యం తల్లి ఓడిపోయినా పర్వాలేదు అనికోవడమా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.అయితే విజయసాయిరెడ్డి చేసిన పనులని పరోక్షంగా వెళ్లగక్కే పని మొదలు పెట్టారు బుద్ద వెంకన్న. ఇలాంటి పనులు చేసేవాన్ని పిచ్చోడు అని అంటారు అని బుద్ధా వెంకన్న విమర్శించినారు. అయితే మొదటి నుండి టీడీపీ నేత బుద్ధా వెంకన్న విజయసాయిరెడ్డి ని టార్గెట్ చేస్తూనే వచ్చారు. అంటే కాకుండా ఎప్పటికపుడు చేస్తున్న విమర్శలని బలంగా తిప్పికొట్టడం లో బుద్ధా వెంకన్న ముందు వుంటారు.