పోలవరం గ్యాలరీ వాక్ లో స్పెషల్ అట్రాక్షన్ ఎవరో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు చరిత్రలో మరో మైలురాయికి బుధవారం శ్రీకారం చుట్టారు. చంద్రబాబు కేంద్రం ఎన్ని అవాంతరాలు కలిగించినా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ . ఈ ప్రాజెక్టు స్పిల్‌వే అంతర్భాగంలో నిర్మించిన గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారా దేవాన్ష్ సందడి చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు నడుస్తూ తిరిగిన దేవాన్ష్ పోలవరం గ్యాలరీ వాక్ లో హుషారుగా పాల్గొన్నాడు.

గ్యాలరీని ప్రారంభించిన చంద్రబాబు అనంతరం కుటుంబసభ్యులతో కలిసి గ్యాలరీలో నడిచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు సైతం పాల్గొన్నారు. అంతకు ముందుకు కుటుంబ సమేతంగా అమరావతి నుంచి హెలికాప్టర్‌లో పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం, గ్యాలరీ పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన పైలాన్‌ను ఆవిష్కరించి ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో సీఎం మనవడు, మంత్రి లోకేశ్ తనయుడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రాజెక్టు వద్ద హుషారుగా తిరుగుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ముందుండి నడవడటం విశేషం.

Facebook Comments