ప‌ర్చూరులో జ‌గ‌న్‌కు ఆశ‌ల్లేవా.. ఏలూరిపై విష ప్రచారం

ఆయ‌న అభివృద్దికి కేరాఫ్‌. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండ‌డం ఆయ‌న‌కు హాబీ. ఏస‌మ‌స్య‌పైనైనా.. ఎంత దూర‌మై నా వెళ్లి ప‌రిష్క‌రించ‌డం ఆయ‌నకు రాజ‌కీయంగా అబ్బిన విద్య‌. ఆయ‌న ద‌గ్గ‌ర మంత్రం లేదు. కానీ, ప్ర జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునే మంత్రాంగం ఉంది. ఆయ‌న ద‌గ్గ‌ర భారీ ఎత్తున లాబీయింగ్ లేదు. కానీ, ప్ర‌జ ల‌తో మ‌మేక‌మై.. వారిని త‌న‌వైపు తిప్పుకొనే మంచి మ‌న‌సుంది. ఇదే ఇప్పుడు అధికార పార్టీ వైసీపీకి నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే.. ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివరా వు. అస‌లు ఓట‌మే ఎరుగ‌ని ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో చుక్క‌లు చూపిం చారు ఏలూరి.

వైసీపీ త‌ర‌పున ద‌గ్గుబాటి, టీడీపీ త‌ర‌ఫున రెండోసారి ఏలూరి ప‌రుచూరులో హోరా హోరీ త‌ల‌ప‌డ్డారు. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సునామీ జోరు సాగింది. అయినా కూడా ఏలూరికి ఇక్క‌డి ప్ర‌జ‌లు జేజేలు ప‌లికారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆయ‌న వివాద ర‌హితుడుగా పేరు తెచ్చుకోవ‌డం, పిలిస్తే.. ప‌లికే నాయ కుడిగా గుర్తింపు తెచ్చుకోవ‌డం, ముఖ్యంగా వ్య‌వ‌సాయ ఆధారిత నియోజ‌క‌వ‌ర్గం అయిన పర్చూరులో రైతుల క‌ష్టాలు తెలిసిన మ‌నిషిగా ఆయ‌న పేరు తెచ్చుకోవడం ఆయ‌న్ను నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగులేని నేత‌గా నిల‌బెట్టాయి. అటు సాగ‌ర్‌కు, ఇటు ప‌ట్టిసీమ‌కు ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం టెయిలెండ్ ఏరియా. అయినా ఏలూరి ప‌ట్టిసీమ గేట్లు గ‌త యేడాది 15 రోజులు అద‌నంగా తెరిపించి అక్క‌డ ప్ర‌తి ఎక‌రాల‌కు నీరందేలా చేశారు. ఇవ‌న్నీ ఆయ‌న్ను ఈ ఎన్నిక‌ల్లో రెండోసారి గెలిపించాయి. ఇక త‌న‌కు రాజ‌కీయంగా జ‌న్మ‌నిచ్చిన టీడీపీ అంటే ఆయ‌న‌కు అనంతాభిమానం. నిజానికి ప‌రుచూరులో ఏలూరి చేప‌ట్టిన అబివృద్ది కార్య‌క్ర‌మాలు గ‌త రెండు ద‌శాబ్దాల్లో ఎప్పుడూ ఎవ్వ‌రూ చేప‌ట్ట‌లేదు. గ‌తంలో కొన్ని ద‌శాబ్దాల పాటు ఇక్క‌డ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చేయ‌ని అనేక అభివృద్ధి ప‌నులు ఏలూరి చేసి చూపించారు.

అదే ఇప్పుడు ఇక్క‌డ వైసీపీ నేత‌ల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. ఆయ‌న టీడీపీలో ఉంటే మ‌ళ్లీ వైసీపీకి క‌ష్ట‌కాలంగానే పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం ఉండేలా ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఏలూరి సాంబ‌శివ‌రావుపై వ‌ల వేసినా ఆయ‌న టీడీపీని వీడే ప‌రిస్థితి లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీలో కొంద‌రు విష ప్ర‌చారం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌న్ ఇక్క‌డ గొట్టిపాటి భ‌ర‌త్‌, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, రావి రామ‌నాథం ఇలా వ‌రుసగా ఎంత‌మంది నాయ‌కుల‌ను మార్చినా వాళ్లెవ్వ‌రు ఏలూరును ఢీకొట్ట‌లేక‌పోతున్నారు. ఫైన‌ల్‌గా ఏలూరిని టీడీపీకి దూరం చేస్తే త‌ప్ప ఇక్క‌డ పార్టీ బ‌ల‌ప‌డ‌ద‌ని భావించి ఇప్పుడు ఈ కొత్త మైండ్ గేమ్‌కు తెర‌లేపారు.