పాదయాత్రలో ఉన్న జగన్ కు ఊహించని దెబ్బ.. వైసీపీకి అవినాష్ రెడ్డి రాజీనామా..!

అనుకున్నదే అయ్యింది. ఇంట గెలవలేని జగన్ రచ్చ గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు. సొంత బాబాయి కొడుకే తన అనుచరులతో కలిసి పార్టీ కి గుడ్ బై చెప్పాడు. విజయనగరం జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ కు ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా పంపించాడు. ఇంతకీ ఎక్కడా అంటే ఈ పాటికి అర్ధమయ్యే వుండాలి. వైసీపీ కంచుకోటలా భావించే కడప జిల్లాలో… రాజీనామా చేసింది కూడా వైఎస్ కుటుంబ సభ్యులే.అసలేం జరిగిందంటే
అవినాష్ రెడ్డి రాజీనామాకు కారణం షర్మిల. జగన్ తర్వాత ష‌ర్మిల వైఎస్ఆర్‌సీపీలో కీల‌క నేత‌గా ఎదుగుతుంద‌ని భావించారు. జ‌గ‌న్ త‌రువాత పార్టీలో నెం.2 ఆమేనంటూ లెక్క‌లు కూడా వేశారు .జ‌గ‌న్ జైల్లో ఉన్న‌ప్పుడు ష‌ర్మిల ఆయ‌న స్థానంలోపాదయాత్ర చేసి పార్టీకి విపరీత‌మైన ప్ర‌చారం చేశారు. ఆమె కీలక రాజకీయ నేతగా ఎదుగుతారనిభావిస్తే గత ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు.ఇప్పుడు పోటీ చేస్తానని పట్టు పడుతున్న చెల్లెమ్మ కడప నుండి కానీ ఒంగోలు నుండిగానీ ఎంపీ బరిలో ఉంటానని కోరుతుంది. ఆ కోరికే జగన్ కు తిప్పలు తెచ్చి పెట్టింది. అవినాష్ రెడ్డి రాజీనామా చేసేదాకా వచ్చింది.

అయితే, గ‌త 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆమె ఎంపీగా ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తుంది అనుకుంటే అనూహ్యంగా త‌ల్లి విజ‌య‌మ్మ వైజాగ్ నుంచి రంగంలోకి దిగింది. 2019 ఎన్నిక‌ల్లో తాను త‌ప్పనిస‌రిగా ఎక్క‌డో ఒక ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచి పార్ల‌మెంట్‌లో అడుగుపెట్టాల‌ని భావిస్తుంద‌ట‌ షర్మిల .క‌డ‌ప లేదా ఒంగోలు. ఈ రెండింటిలో ఏదో ఒక లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేయాల‌ని ఆమె ఫిక్స‌యింద‌ట‌. ఇదే ఇప్పుడు వైసీపీలో క‌ల‌క‌లం రేపుతుంది.

2014 ఎన్నిక‌ల్లో అవినాష్‌రెడ్డి ఎంపీగా పోటీ చేయించారు.ఇక 2019 ఎన్నిక‌ల్లో క‌డ‌ప నుంచి ష‌ర్మిల పోటీ చేస్తే.. అవినాష్‌రెడ్డికి మ‌రో స్థానం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, అవినాష్ ఫ్యామిలీ ఇందుకు స‌సేమిరా అంటుంద‌ట‌. వైఎస్ఆర్ ద‌గ్గ‌ర్నుంచి జ‌గ‌న్ వ‌ర‌కు త‌న ఫ్యామిలీ మొత్తం మీ కోస‌మే త్యాగం చేశారని ప‌ద‌వులు మాత్రం మాకు ద‌క్క‌వా..? అని ప్ర‌శ్నించార‌ట జ‌గ‌న్ బాబాయ్‌.ఇలా అయితే, తాము టీడీపీలో చేరుతామ‌ని కూడా జ‌గ‌న్‌తో మొహ‌మాటం లేకుండా చెప్పేశార‌ట అవినాష్‌రెడ్డి. దీంతో అవినాష్‌రెడ్డి వైసీపీకి తాను రాజీనామా చేసి ఆ లేఖ‌ను విజ‌య‌న‌గ‌రంలో పాదయాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపార‌ట‌.. మొత్తానికి చెల్లెమ్మ కాలు పెట్టాలనుకుంటే ఆ ఎంపీ కుటుంబమే బయటకు పోతుంది. జగన్ వదిలిన బాణం అయిన షర్మిల ఎఫెక్ట్ ప్రత్యర్ధి పార్టీకి తాకాలి కానీ ఇలా రివర్స్ అయ్యింది అని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు .

Facebook Comments