అడ్డంగా బుక్ అయిన జగన్ మిడియా…

రాష్ట్రంలో పెరిగిపోతున్న ఇసుక లభ్యత విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రోజురోజుకు ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇసుక కొరత ఎందుకొచ్చింది ? జగన్ తీసుకొచ్చిన నూతన ఇసుక విధానం వల్లనా ? లేకపోతే కురుస్తున్న భారీ వర్షాల కారణంగానా ? కారణాలేవైనా సరే జగన్ మీద ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా రెచ్చిపోతూ ప్రజల్లో వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నది మాత్రం వాస్తవం.ఇసుక కొరత అన్నది కొత్తగా ఇపుడే వచ్చింది మాత్రం కాదు.

చంద్రబాబునాయుడు హయాంలో కూడా కొరతుంది. కాకపోతే అప్పట్లో ఇసుక లభ్యత విషయంలో ఇపుడంత కొరత లేదు. అప్పట్లో టిడిపి నేతలే బయటరాష్ట్రాలకు తరలించేవాళ్ళు. ఎక్కువ ధర ఎవరైతే ఇస్తారో వారికే అమ్మేవారు. పేరుకేమో ఇసుక ఉచితం. మరి ఇసుకను ప్రభుత్వం వినియోగదారులకు ఉచితంగా ఇస్తే టిడిపి నేతలు కోట్ల రూపాయలు ఎలా సంపాదించుకున్నారు ?సరే ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని అనుకున్నారు. అందుకనే నూతన ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. కొత్త విధానం అమల్లోకి వచ్చేసమయానికి వర్షాలు, తుపాను మొదలైంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జిల్లాల్లో ఎక్కడ చూసినా జలమయమే. అందుకనే ఇసుకను తవ్వి తీయటం సాధ్యం కావటం లేదు. చంద్రబాబు హయాంలో వర్షమన్నదే లేదు కాబట్టి ఇసుక తవ్వకాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు.

జగన్ సిఎం అయిన దగ్గర నుండి ఇప్పటికి కూడా భారీ వర్షాలు పడుతునే ఉన్నాయి. వర్షాలు పడుతున్న సమయంలో ఇసుక తవ్వకాలు సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడే జనాలను ఎడ్యుకేట్ చేయటంలో మంత్రులు, జగన్ మీడియా పూర్తిగా ఫెయిలైంది. ఇసుక సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను జనాలకు వివరించటంలో మంత్రులు, జగన్ మీడియా చూపాల్సినంత చొరవను చూపటంలేదు. అందుకనే ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా రెచ్చిపోతున్నాయి.

Facebook Comments