వైఎస్ జగన్ సంచలన నిర్ణయం…..షాక్ అవుతున్న వైసీపీ క్యాడర్

ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదు చేసుకొని, రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అందరికి కూడా సమన్యాయం చేస్తూ రాష్ట్ర పాలన పరంగా అందరి మెప్పు పొందుతున్నదరు. కాగా ఎన్నికల్లో పోటీ చేసిన, చేయకపోయినా కూడా జగన్ కి పూర్తిగా మద్దతు ఇచ్చిన వారందరికీ కూడా జగన్ న్యాయం చేస్తున్నాడు. కాగా ఎన్నికల సమయంలో జగన్ కి పూర్తిగా సహాయపడినటువంటి పీకే టీం లో ఒక సభ్యుడికి సీఎం జగన్ ఒక కీలక బాధ్యతను అప్పగించారు.కాగా ఏపీ ప్రభుత్వం కొత్తగా ఇద్దరు చీఫ్ డిజిటల్ డైరెక్టర్లను నియమించింది.

అందులో సీవీ రెడ్డి, బ్రహ్మానంద పాత్ర అనే ఇద్దరిని చీఫ్ డిజిటల్ డైరెక్టర్లుగా నియమిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వ అధికారులు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బ్రహ్మానంద పాత్ర అనే వ్యక్తి ప్రశాంత్ కిషోర్ కి చెందిన ఐప్యాక్ టీం సభ్యుడు. కాగా ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ జగన్ కి డిజిటల్ సపోర్ట్, స్ట్రాటజిస్టుగా వ్యవహరించారు. అయితే ఎన్నికల తరువాత ప్రశాంత్ కిషోర్ తన స్వరాష్ట్రానికి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం సభ్యుడికి ఈ పదవి అప్పగించడం అనేది మరొకసారి చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైసిపి కార్యకర్తల్లో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి, ఎక్కువ మంది వైసిపి కార్యకర్తలు కష్టపడినా తమను పక్కన పెట్టి ఎవరినో తీసుకురావటం ఏంటని వ్యాఖ్యలు చేస్తున్నాయి.

Facebook Comments