వైసీపీ మంత్రులను హెచ్చరించిన జగన్

ఇప్పుడు ఎపీలో ప్రస్తూతం జరుగుతున్న పరీస్థితులపై జగన్ వైసీపీ మంత్రులను కాస్త గట్టిగానే హెచ్చరించాడు.ఆంధ్రప్రదేశ్ లో వైకాపా అధికారంలోకి వచ్చి అయిదు నెలలు అయ్యింది… తనదయిన మార్క్ రాజకీయంతో జగన్ ముందుకు వెళ్తున్నారు… తొలి ప్రాధాన్యతగా అన్ని రకాల పదవులు పందేరంలో ఇన్నాళ్లు తలమునకలు అయ్యారు… ఇప్పటికి దాదాపుగా అన్ని కీలక పదవుల నియామకాలు జరిగిపోయాయి… ఒక పక్క రాష్ట్రం కీలక ఆర్ధిక లోటుతో అల్లకల్లోలం అవుతుండగా ఎన్నికల హామీల అమలు ఎలా చెయ్యాలి అని తర్జన భర్జనలు పడుతున్నారు…

అందుకే కాబోలు ఒక్క సారిగా అమలు పరచాల్సిన హామీలు విడతల వారీగా ఇస్తాము అని ప్రకటించారు… మరో పక్క ఇసుక కొరత పై ఇప్పటికీ స్పష్టత రాకపోవటం దాని వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలు ఇప్పటికే ప్రభుత్వం పై తీవ్ర అసహనంతో ఉన్నారు అని ఇంటలిజెన్స్ రిపోర్టులు జగన్ వద్ద ఉన్నాయి… మరో పక్క కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతాయి అనేది అతి పెద్ద ప్రశ్నగా మిగిలింది…ఇవన్నీ ఇలా ఉండగా ఇద్దరు ముగ్గురు మంత్రుల అత్యుత్సాహం వల్ల పార్టీకి నష్టం కలగటమే గాక ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని జగన్ కి నివేదికలు అందాయి… ఈ నివేదికల పై జగన్ తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలుస్తుంది… అందరిలోకి మంచివారు అని నమ్మిన వారికే మంత్రి పదవులు కేటాయించాను అని అలాంటి వారి వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఇబ్బందిగా ఉంది అని… ఇప్పుడు అందరి సమక్షంలో హెచ్చరిస్తున్నాను

అని ఒక వేళ ముందు ముందు సదరు మంత్రులు వ్యవహారశైలి మార్చుకోకపోతే మాత్రం మంత్రి వర్గం నుంచి తీసేయటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించాను అని వ్యాఖ్యానించారు అని తెలుస్తుంది… అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న ఆ ఇద్దరు ముగ్గురు మంత్రులు ఎవరు అనేది మాత్రం జగన్ బహిర్గతం చేయలేదు అని తెలుస్తుంది…

Facebook Comments