జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజిమంత్రి…

ఏపీ రాజకీయ వర్గాల్లో ఫైర్ బ్రాండ్ రాజకీయ నేతల జాబితా తీసినట్టైతే అందులో తప్పకుండ తెలుగుదేశం పార్టీ నేత అయినటువంటి జేసీ దివాకర్ రెడ్డి పేరు ముందు వరుసలో ముమ్మాటికీ ఉంటుంది.గతంలో ఆయన ఎంపీ గా ఉన్నపుడు ప్రతిపక్ష నేత అయినటువంటి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎలాంటి వ్యాఖ్యలు చేసేవారో అందరికి తెలుసు.అసలు జగన్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు అన్న మాటల నుంచి ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ అని ఆయనే చెప్పే స్టేజ్ కు వచ్చేసారు.అలాగే జగన్ విషయంలో ముందు చూపినంత అగ్రెసివ్ నెస్ కూడా చూపించడం లేదు.కానీ ఇప్పుడు మళ్ళీ మరోసారి జగన్ గెలుపుపై జేసీ సంచలనం రేపే కామెంట్స్ చేసారు.

జగన్ సీఎం అవ్వడని అనుకున్నానని కానీ అయ్యాడని దానికి గల కారణాలు కూడా చెప్తానని తెలిపారు.మొదటగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఏపీ ప్రజలు చూసారని అందుకే ఒకసారి జగన్ పాలన కూడా ఎలా ఉంటుందో అని ఈసారి జగన్ కు పట్టం కట్టారని అన్నారు.అంతేకాకుండా ఈసారి మార్పు కావాలని చాలా బలంగా కూడా కోరుకున్నారని అందుకే జగన్ అధికారంలోకి వచ్చాడని అంటూ ఇప్పుడు బాంబు పేల్చారు.వీటితో పాటుగా కేంద్రంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ మంత్రం కూడా ఏదో వేశారని అది మాత్రం ఏమిటో తనకి తెలీదని నేను చెప్పనని ఆఖరులో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.మరి జేసీ ఏ ఉద్దేశంతో అలా అన్నారో అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చినీయాంశం గా మారింది.

Facebook Comments