వైఎస్ జగన్ షాకింగ్ ప్రకటన… ఇక జరగబోయేది ఇదేనా..?

వైఎస్ జగన్ గత అసెంబ్లీ చివరిరోజు రాజధాని గురించి ఏలాంటి సంచలన ప్రకటన చేశాడో అందరికి తేలిసిన విషయమే. ఇక దినిపై రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.అంతా అనుకున్నదే జరిగింది. 33 రోజుల పాటు, అమరావతి రైతులు చేసిన ఆందోళన అరణ్య రోదనే అయ్యింది. రైతులు కన్నీళ్ళు మధ్యే, ఈ రోజు భేటీ అయిన క్యాబినెట్, అమరావతి రైతుల నెత్తిన పిడుగు పడే నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుపై మంత్రివర్గం చర్చించింది. హైపవర్‌ కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. మొత్తం ఏడు అంశాల అజెండాగా మంత్రివర్గ సమావేశం కొనసాగింది. కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలివి.. హైవపర్‌ కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుకు ఆమోదం. సీఆర్‌డీఏ రద్దుకు కేబినెట్‌ ఆమోదం. పులివెందుల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం. ఏఎంఆర్డీఏ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం.

 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించి లోకాయుక్త విచారణకు ఆమోదం. రైతులకు 15 ఏళ్లపాటు కౌలు చెల్లించేందుకు నిర్ణయం. క్యాబినెట్ నిర్ణయం తరువాత, అసెంబ్లీ బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన బీఏసీ హాజరైన సీఎం జగన్ ,శ్రీకాంత్ రెడ్డి, మంత్రులు బుగ్గన,కన్నబాబ,అనీల్ కుమార్ . టీడీపీ నుండి హాజరైన అచ్చెన్నాయుడు. బీఏసీ సమావేశం తరువాత, వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లు 2020ను సభలో ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. AP సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును సభలో ప్రవేశ పెట్టిన మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. తరువాత వికేంద్రీకరణ బిల్లు పై అసెంబ్లీలో, చర్చను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ, “కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని. కర్నూలులోనే న్యాయపరమైన అన్ని శాఖలు. హైకోర్టు అనుమతి తర్వాత ఇవి ఏర్పాటు చేస్తాం. ఇది చారిత్రాత్మక బిల్లు. అమరావతిలోనే లెజిస్లేటివ్ రాజధాని, విశాఖలో రాజ్‌భవన్‌, సచివాలయం. పన్ను కట్టే ప్రతివారికి న్యాయం చేయాలి. పరిపాలన అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ బిల్లు. సమ్మిళిత అభివృద్ధి మన లక్ష్యం” అని బుగ్గన తెలిపారు.