జగన్ కు బిగ్ షాక్ …వైఎస్ నమ్మిన బంటు టీడీపీ తీర్ధం

రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎలా మారతారో ఎవరికీ తెలీదు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు.. శాశ్వాత మిత్రులు ఎవ‌రూ ఉండ‌ర‌నే సామెత నిజం. శ‌త్రువుకు శ‌త్రువే మిత్రుడ‌నే సూత్రాన్ని ప్ర‌స్తుతం రాజ‌కీయ పార్టీలు బాగా పాటిస్తున్నాయి. రాజ‌కీయాల్లో ఎప్పుడూ ఏం జ‌రుగుతుందో ఊహించ‌డం చాలా క‌ష్టం. బద్ధ శత్రువులు కూడా రాజకీయ కారణాలతో కలిసి పని చేస్తున్న రాజకీయ వాతావరణం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది.  వైఎస్ ఫ్యామిలీకి ఒకప్పుడు అత్యంత స‌న్నిహితుడుగా, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి అత్యంత న‌మ్మిన‌బంటుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పేరు సంపాదించుకున్న సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు కొణతాల రామకృష్ణ టీడీపీలో చేర‌డం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఉత్త‌రాంధ్ర సీనియ‌ర్ నేత కొణ‌తాల రామ‌కృష్ణ‌ ను వైసీపీ మీద యుద్ధం చేసేందుకు రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నాడు చంద్రబాబు. ఎంపీ గా ఎన్నికల నిలిపేందుకు కసరత్తు చేస్తున్నాడు.

విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి పార్ల‌మెంట్ స్ధానం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున రెండు సార్లు ఎంపీగా గెలిచిన కొణ‌తాల రామ‌కృష్ణ‌, అలాగే అన‌కాప‌ల్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఒక‌సారి ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా కూడా ప‌నిచేశారు. వైఎస్ కుటుంబానికి వీర విధేయుడుగా ఆయ‌న‌కు మంచి పేరు ఉంది. ఉత్తరాంధ్రలో బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన నేత ఆయ‌న‌. అలాగే వివాద‌ర‌హితుడుగా, సౌమ్యూడిగా ఆయ‌న‌కు మంచి పేరు ఉంది.అయితే వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత వైసీపీలో చేరిన కొణ‌తాల‌, జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. వైసీపీలో నెంబ‌ర్ టూగా ఆయ‌న ఎదిగారు. కానీ జగన్ వైఖరి నచ్చక కొణతాల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఇంతకాలం క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న కొణ‌తాల‌, ఉత్త‌రాంధ్ర స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తున్నారు. విశాఖ రైల్వే జోన్‌పై ఆయ‌న ఇప్ప‌టికే పోరాడుతూనే ఉన్నారు. అయితే ఎన్నిక‌లు ముంచుకు వ‌స్తున్న నేప‌థ్యంలో 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి క్రియాశీల రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టాల‌ని భావిస్తున్న కొణ‌తాల ను టీడీపీ ఆహ్వానిస్తుంది.మంచి వాడిగా పేరున్న కొణతాల రామకృష్ణ కి అవకాశం ఇస్తే గెలుపు నల్లేరు మీద నడక అని భావిస్తున్న చంద్రబాబు కొణ‌తాల‌ను టీడీపీలో తెచ్చుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. దాంతో టీడీపీలో చేరేందుకు కొణ‌తాల సైతం ఆసక్తిగా ఉన్నారు. రానున్న ఎన్నిక‌ల్లో అన‌కాప‌ల్లి ఎంపీ అభ్య‌ర్ధిగా ఆయ‌న‌ను బ‌రిలోకి దింపేందుకు టీడీపీ అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అన‌కాప‌ల్లి ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి పోటీ చేసేందుకు పావులు క‌దుపుతున్నారు. దీంతో కొణ‌తాల‌ను ఎంపీగా బ‌రిలోకి దింపేందుకు చంద్ర‌బాబు ఆలోచనల ఉన్నారు. ఏది ఏమైనా వైఎస్ నమ్మిన బంటుగా పేరున్న కొణతాల రాక టీడీపీకి ప్లస్ అవుతుంది అనేది రాజకీయ వర్గాల భావన.

Facebook Comments