వైసీపీలో విబెధాలు… జగన్ సీరియస్ వార్నింగ్..

ఏపీలో  వైసీపీ లో నాయకుల మధ్య  ఇప్పుడు అంతర్గత విభేధాలు  బగ్గుమన్నాయి.ఎస్వీబీసీ ఛైర్మన్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాజధాని రైతుల్ని ఉద్దేశించి పృథ్వీ మాట్లాడిన మాటలు సరికాదని జగన్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. సమస్యలపై మాట్లాడాలే తప్పా… కులాల ప్రస్తావన చేయడం సరికాదని ఆయనకు మొట్టికాయలు వేశారు జగన్. రైతులపై ఇష్టానుసారంగా మాట్లాడితే… అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కులాలను ప్రస్తావిస్తూ.. ఎవరినీ కించపరిచేలా మాట్లాడకూడదని సీఎం పృథ్వీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.