వైసీపి మంత్రికి ఓపెన్ ఛాలెంజ్….అది చేసే దమ్ముందా..!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచింది. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానం వలన ఏపీలో తీవ్ర ఇసుక కొరత ఏర్పడింది. భవన నిర్మాణ కార్మికులు పనులు దొరకక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటికే విపక్షాలు ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నాయి.అయితే ఇసుక కొరతపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు సవాల్ విసిరారు.

వైసీపీ నేతల ఇసుక అక్రమాలను మీడియా ముందు నిరూపిస్తానని అలా నిరూపిస్తే రాజీనామా చేస్తావా అంటూ సవాల్ విసిరారు. అవంతికి వాస్తవ పరిస్థితులపై చర్చించే ధైర్యం ఉందా అని ప్రశ్నించాడు. విశాఖలో ఇసుక కొరతతో ఎన్నో భవనాలు నిలిచిపోయాయని, చెన్నై, బెంగళూరుకు లారీలు లారీలు తరలిస్తున్న విషయం మీకు తెలియదా అని మండిపడ్డారు. కార్మికుల ఆత్మహత్యలకు వైసీపీ ప్రభుత్వ ఇసుక మాఫియానే కారణమని మండిపడ్డారు.