వైసీపీ ఎంపి దగ్గరకు వేళ్ళిన టీడీపీ ఎమ్మెల్యె..అసలు విషయం ఇదేనా..??

రాజకీయంలో ఇప్పుడు ఎక్కడ చిన్న అవకాశం దోరికినా అది కాస్త ఎక్కడికో వెళ్తుంది. ఇప్పుడు అదె జరిగింది కాకపోతే  అందరి ముందు వెళ్లారు కాబట్టి పెద్దగా ఏవరు ఏమనుకోరని అందరు అనుకుంటున్నారు. అసలు ఏవరా వైసీపీ ఎంపీ. అసలు టీడీపీ ఎమ్మెల్యె ఎవరు అని అందరు అనుకుంటున్నారు.వైఎస్సార్ ఎంపీ పుట్టినరోజు వేడుకలకు కుమారుడ్ని వెంటబెట్టుకొని వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే. పక్కనే మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలు. ప్రకాశం జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ బర్త్ డే వేడుకలకు టీడీపీ ఎమ్మెల్యే వెళ్లడం చర్చనీయాంశమయ్యింది. మంగళవారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పుట్టిన రోజు.ఈ సందర్భంగా ఒంగోలులో ఎంపీ బర్త్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి బాలినేనితో పాటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.

మాగుంట శ్రీనివాసులురెడ్డి పుట్టిన రోజు వేడుకలకు చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి హాజరయ్యారు. శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించే వరకు అక్కడే ఉన్నారు. అంతేకాదు ఎంపీ గురించి నాలుగు మంచి మాటలు చెబుతూ ప్రసంగించారు. ఈ వేడుకలకు తన రాజకీయ వారసుడు, కుమారుడు కరణం వెంకటేష్‌‌ను కూడా తీసుకెళ్లారు. కొందరు అనుచరులు కూడా వెళ్లారట.టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఎంపీ మాగుంట బర్త్ డే వేడుకలకు వెళ్లడం ఆసక్తిగా మారింది. అయితే బలరాం వెళ్లడం వెళ్లడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని టీడీపీ నేతలు చెబుతున్నారు. మాగుంట ఎన్నికల ముందు వరకు టీడీపీలో కొనసాగారు.. ఎమ్మెల్సీగా ఉన్నారు.. తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎంపీతో మంచి సాన్నిహిత్యం ఉండటంతోనే కరణం పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారని చెబుతున్నారు. అంతేకాదు బలరాం జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఉన్నారు.. దీన్ని కూడా రాజకీయ కోణంలో చూడటం సరికాదంటున్నారు.అంతేకాకుండా మాగుంట శ్రినివాసులు కోసమే అక్కడికి కరణం బలరాం వెళ్లాడు. అంతే కానీ ఏలాంటి రాజకీయాల కోసం కాదు. అని పలువురు వ్యక్తం చేశారు.

Facebook Comments